- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డెక్కిన బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్
దిశ, మల్యాల: రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కాన్వాయ్ పైన రాళ్ళతో దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేసిన టీఆర్ఎస్ నాయకులని గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బింగి వేణు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అనంతరం దాడి ఘటనపై మండల నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక ఎంపీ రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, అలాంటి ప్రజాప్రతినిధుల మీద దాడి చేయడం సరికాదన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకార ధోరణికి ఈ దాడి నిదర్శనం అంటూ విమర్శించారు. దాడి ఘటనలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఎంకరేజ్ చేసి.. పోలీస్ అధికారుల సమక్షంలో జరిగేందుకు పథకం వేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి వెంకట స్వామి, ముదిగంటి రాజు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.