- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాషాయ కంకణం కట్టుకున్నాం.. కమలం పువ్వును గెలిపిస్తాం
దిశ, చార్మినార్: హైదరాబాద్ చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం దర్శించుకున్నారు. తొలి విడుత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బండి సంజయ్ భార్య అపర్ణ, కుమారులు భగీరథ్, సుముక్ కుమారులతో కలిసి పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా ప్రశాంతంగా పూర్తయ్యిందన్నారు.
కాషాయ కంకణం కట్టుకున్నాం.. హుజురాబాద్లో కమలం పువ్వును గెలిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వెంట యాత్ర ప్రముక్ మనోహర్ రెడ్డి, సహ ప్రముక్ వీరేందర్ రెడ్డి, మీడియా ఇన్చార్జి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్, సురేందర్ రెడ్డి, గౌతమ్, వెంకట్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు భాస్కర్, ఉమా మహేంద్ర, ఆనంద్ గుప్త, కొలన్ శంకర్ రెడ్డి, పొన్న వెంకట రమణ, రూప్ రాజ్, మహిళా నేతలు గీతారెడ్డి, శ్రీదేవి రెడ్డి, పద్మారెడ్డి, శోభారాణి, త్రివేణి, సుధా, కసిరెడ్డి పద్మ, ఉమారాణి, గౌరి, కాంచన కృష్ణ, శ్యామల తదితరులు ఉన్నారు.