ఇమ్యూనిటీ పెంచే అనుష్క ఫేవరేట్ చాయ్

by  |
ఇమ్యూనిటీ పెంచే అనుష్క ఫేవరేట్ చాయ్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తన నటనతోనే కాదు తన వర్కౌట్స్ తోనూ ఆకర్షిస్తుంది. ఆరోగ్యాన్ని, ఫిట్ నెస్ ను కాపాడుకోవడంలో అనుష్క శర్మ, తన భర్త విరాట్ తో ఎప్పుడు పోటీ పడుతుంది. క్వారంటైన్ టైమ్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ఇన్ స్టా వేదికగా ‘కిచెన్ సీక్రెట్స్’ పంచుకుంటారు. మన ఇమ్యూనిటి పెంచే చాయ్ గురించి అనుష్క ఇటీవలే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

అనుష్క, విరాట్ దంపతులిద్దరూ ఫిట్ నెస్ విషయంలో అస్సలు రాజీ పడరు. ఆరోగ్యం విషయంలోనూ అంతే. బరువు పెరిగే ఆహార పదార్ధాలకు దూరంగా ఉంటూనే, ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటిని పెంచే ఆహార నియమాలు పాటిస్తుంటారు. ‘మనం ఏం చేసినా.. శరీర నిరోధక శక్తి పెరగాలి. అందుకోసం పసుపు, మిరియాల చాయ్ ఉదయాన్నే తాగితే శరీరానికి ఎన్నో లాభాలుంటాయని’ ఆ లవ్ లీ కపుల్స్ చెబుతున్నారు. ఈ రెండు ఇన్ గ్రీడియన్స్ వల్ల చాయ్ టేస్ట్ పెరగడంతో పాటు, శరీరానికి న్యూట్రిషన్ అందుతుంది. పసుపు, మిరియాలు యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటాయి. యాంటీ ఇన్ ఫ్లేమటరీ , యాంటీసెప్టిక్, ఇమ్యూన్ బూస్టింగ్ గానూ పనిచేస్తాయి. క్రిములు, సూక్ష్మ జీవులు, వైరస్ లు శరీరాన్ని అటాక్ చేస్తే.. వాటి ముప్పు నుంచి కాపాడుకోవడానికి పసుపు, మిరియాల చాయ్ చాలా బాగా ఉపయోగపడుతుందని అనుష్క, కోహ్లీలు చెబుతున్నారు. చాయ్ లా మితంగా తాగాలనే రూల్ ఏం లేదు. పసుపు, నల్ల మిరియాల పొడిని వేడినీళ్లతో కలిపి అప్పుడప్పుడూ కాస్త సిప్ చేస్తూ ఉంటే చాలు. శరీరానికి ఎన్నో లాభాలు అందుతాయి. దీంట్లో తేనే లేదా బెల్లం యాడ్ చేసుకుంటే.. టేస్ట్ మరింత బాగుంటుందని వాళ్లు అంటున్నారు. ఇమ్యూన్ పవర్ పెరగాలంటే.. పసుపు, నల్ల మిరియాలతో కూడిన చాయ్ తాగాలని వైద్యులు కూడా చాలా మంది సూచిస్తున్నారు. అన్నట్లు ఈ రోజు (మే 1) అనుష్క పుట్టినరోజు.

tags: coronavirus, immunity boosters, anushka sharma, virat kohli


Next Story

Most Viewed