ఫ్యాన్‌ను మానిప్యులేట్ చేసిన అమెరికన్ సింగర్.. ఎలాగో తెలుసా?

by Shyam |   ( Updated:2023-05-19 13:48:31.0  )
Billie Eilish
X

దిశ, సినిమా: సెలబ్రిటీలు ఏ పనిచేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటుంది. అమెరికన్ సింగర్ అండ్ సాంగ్ రైటర్ బిల్లి ఐలిష్ చేసిన పని కూడా ఇప్పుడు వైరల్ అయింది. నియాన్ ‘గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ హెయిర్‌’లో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు తన పాటలతో కిక్ ఇచ్చే ఐలిష్.. తన న్యూలుక్‌తో షాక్ ఇచ్చింది. 19 ఏళ్ల ఈ సెలబ్రిటీ ‘గోల్డ్ కలర్’ హెయిర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. తన ఐకానిక్ స్టైల్‌లో కాకుండా కొత్తగా కనిపించిన ఐలిష్‌ను చూసి కాస్త ఖంగుతిన్న ఫ్యాన్స్.. అంతలోనే తేరుకుని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఈ యంగ్ సూపర్ స్టార్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 77.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ఈ న్యూ లుక్‌ పిక్ 9 మిలియన్‌కు పైగా లైక్స్‌ సాధించడం విశేషం. ‘ఓ మై గాడ్, ఐ యామ్ ఇన్ లవ్, దిస్ ఈజ్ అమేజింగ్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ లైక్‌లు కొడుతుండగా.. ఓ అభిమాని మాత్రం ఈ ఫొటోను అరగంటపాటు చూస్తూనే ఉన్నానని, తన చేత ఈజీగా మానిప్యులేట్ చేయబడ్డానని తెలిపింది. కాగా ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement

Next Story