ఆ వ్యాక్సిన్ తయారీకి ‘గేట్స్’ ఓపెన్

by vinod kumar |
ఆ వ్యాక్సిన్ తయారీకి ‘గేట్స్’ ఓపెన్
X

కరోనాను వ్యాక్సిన్ రూపొందించేపనిలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. కేవలం ఆయా ప్రభుత్వాల సంస్థలే కాకుండా పలు ప్రైవేటు పరిశోధనాకేంద్రాలు, ఎన్జీవోలు వ్యాక్సిన్ తయారీలో పాలుపంచుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఫౌండేషన్ కూడా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏడాదిలోపే కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తామని గేట్స్ వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీలో విఫలమైనా సరే కోవిడ్-19కు ఔషధం కనుగొనడంలో విజయం సాధిస్తామనీ, దీనికి రెండేళ్ల సమయం పడుతుందని బిల్‌గేట్స్ చెప్పారు. కేవలం వ్యాక్సిన్ అభివృద్ధే కాకుండా దాని తయారీ ప్రక్రియపై కూడా దృష్టి సారించినట్లు గేట్స్ చెప్పారు. మరోవైపు అమెరికాలో అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్నారని.. అనవసరమైన వ్యక్తులకు పరీక్షలు నిర్వహించడం ఖర్చు, సమయం వృధా చేయడమేనని గేట్స్ అభిప్రాయపడ్డారు. కరోనాకు సంబంధించిన ఏడు వ్యాక్సిన్ల తయారీకి గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేస్తోంది.

Tags : Bill Gates, Gates Melinda Foundation, Microsoft, Coronavirus, Covid 19, Vaccine

Advertisement

Next Story

Most Viewed