- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాపిడో సేవలు షురూ..
దిశ, వెబ్‌డెస్క్:
బెంగళూరు బేస్డ్ కంపెనీ ‘రాపిడో’ బైక్ ట్యాక్సీ విభాగంలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాకెట్ మనీ కోసం చాలామంది యూత్ రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్లుగా జాయిన్ అయ్యారు కూడా. కానీ, కరోనా కారణంగా రాపిడో బైక్ ట్యాక్సీకి బ్రేకులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ 4.0లో భాగంగా పలు ఆంక్షలు సడలించడంతో రాపిడో తన సేవలను బుధవారం నుంచి మళ్లీ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 39 సిటీల్లో తమ సేవలను తిరిగి ప్రారంభించామని రాపిడో వెల్లడించింది. ప్రస్తుతానికి గ్రీన్, ఆరెంజ్ జోన్లలోనే తమ సేవలను ప్రారంభించామని, కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి సేవలను అందించడం లేదని ఆ కంపెనీ తెలిపింది.
లాక్‌డౌన్ నిబంధనలకు అనుకూలంగా యాప్‌ను వాడాలంటే రాపిడో కెప్టెన్లు, కస్టమర్లు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. కచ్చితంగా మాస్కులు, శానిటైజర్లను వాడటంతో పాటు ఇతర జాగ్రత్తలు కూడా పాటించాలని చెప్పింది. రాపిడో కెప్టెన్లు.. ప్రతి కస్టమర్ ఎక్కి, దిగిన తర్వాత సీటును శానిటైజ్ చేయాలని సూచించింది. కంపెనీ తరఫున శానిటైజర్, మాస్క్‌లు అందిస్తామని.. కస్టమర్లకు కూడా హెల్మెట్లు అందిస్తామని తెలిపింది. అంతేకాకుండా మాస్క్ ధరించని కస్టమర్ల రైడ్ క్యాన్సిల్ చేయాలని కెప్టెన్లకు సూచించింది. రాపిడో సేవలను ప్రారంభించడం వల్ల దాదాపు 3 లక్షల మంది రాపిడో కెప్టెన్లకు (బైక్ ట్యాక్సీ రైడర్లు) ఉపాధి లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.