నటి కాజోల్‌ డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఎందుకో తెలుసా.?

by Shyam |   ( Updated:2023-06-13 16:36:13.0  )
నటి కాజోల్‌ డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఎందుకో తెలుసా.?
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో భార్య, సీనియర్ హీరోయిన్ కాజోల్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. అందం, అభినయంతో ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్‌ కలిగి ఉన్న తను.. ప్రస్తుతం డ్రెస్సింగ్‌ విషయంలో ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. కాస్ట్యూమ్స్, హెయిర్‌ స్టైల్‌‌కు సంబంధించి తరచూ ప్రయోగాలు చేసే నటి.. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో బాడీ-కాన్ బ్లాక్ గౌన్ ధరించి రెడ్‌ కార్పెట్‌పై నడిచింది.

అయితే పర్టిక్యులర్ స్టైల్‌పై ట్రోలింగ్‌కు దిగిన నెటిజన్లు.. నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరు ‘ఆమె నా బైక్‌ కవర్‌ వేసుకొచ్చింది’ అంటే.. మరొకరు ‘అది మా ఇంట్లోని బ్లాంకెట్‌లా ఉందని, ఒకవేళ అవార్డు రాకపోతే కప్పుకొని పడుకోవచ్చు’ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకాస్త ఘాటుగా స్పందించిన మరో నెటిజన్.. కాజోల్‌ అవుట్‌‌ఫిట్‌ ‘ఫ్యాషన్‌ డిజాస్టర్‌’ అని క్యాప్షన్ ఇచ్చేశాడు. ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌తో వివాహం తర్వాత సినిమాలకు దూరమైన కాజోల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంపార్టెంట్ రోల్స్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed