- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేనేజర్ గారు బ్యాంక్‌కు డెడ్ బాడీ వచ్చింది.. ఇప్పుడు ఇవ్వండి డబ్బులు
దిశ,వెబ్‌డెస్క్: ఓ వ్యక్తికి పెళ్లికాలేదు. కుటుంబం లేదు. చుట్టాలు లేరు. అనారోగ్యం కారణంగా మరణించాడు. అంత్యక్రియలు చేయాలి. గ్రామస్తుల దగ్గర డబ్బులు లేవు. డెడ్ బాడీ అలాగే ఉంది. ఏం చేయాలో పాలుపోని ఊరి గ్రామస్తులు స్థానికంగా ఉన్న బ్యాంక్ దగ్గరకు వెళ్లారు. బాధితుడి అకౌంట్ లో డబ్బులు ఏమైనా ఉన్నాయో చెక్ చేయాలని బ్యాంక్ అధికారుల్ని కోరారు. బాధితుడి అకౌంట్ చెక్ చేసిన అధికారులకు.. అకౌంట్‌లో లక్షరూపాయలున్నాయి. డబ్బులు ఇచ్చేది లేదంటూ బ్యాంక్ మేనేజర్ తిరస్కరించారు. దీంతో బ్యాంక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఓ ఉపాయంతో బ్యాంక్ కు వచ్చారు. అంతే కంగుతిన్న బ్యాంక్ మేనేజర్ ఈ పదివేలు తీసుకొని కార్యక్రమాలు చేయండంటూ ప్రాధేయ పడ్డారు. ఇంతకీ గ్రామస్తులు ఏం చేశారని అనుకుంటున్నారా..?
బీహార్ రాజధాని పాట్నా పరిధికి చెందిన సిగరియావా గ్రామానికి చెందిన మహేష్ యాదవ్(55) అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. దీంతో అతని అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు కావాలంటూ గ్రామస్తులు సమీపంలో ఉన్న కెనరా బ్యాంక్ అధికారుల్ని ఆశ్రయించారు. అంత్యక్రియులు చేసేందుకు తమ వద్ద డబ్బులు లేవని, బాధితుడి అకౌంట్ లో డబ్బులుంటే ఇవ్వాలని బ్యాంక్ మేనేజర్‌ను కోరారు. బ్యాంక్ మేనేజర్ డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదు. కనికరం లేకుండా మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ తిప్పి పంపించాడు. ఇలా అడిగితే డబ్బులు ఇవ్వరు. ఏం చేస్తే డబ్బులిస్తారో మాకు బాగా తెలుసంటూ ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.బాధితుడి డెడ్ బాడీని కెనరా బ్యాంక్ కు తరలించి.. మేనేజర్‌గారు బ్యాంక్‌కు డెడ్ బాడీ వచ్చింది.. ఇప్పుడైనా మా డబ్బులు మాకిస్తారా .. ఆ డెడ్ బాడీని అక్కడే ఉంచారు. 3 గంటల పాటు మహేష్ మృతదేహం బ్యాంక్‌లోనే ఉంది. బ్యాంక్ మేనేజర్ ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు అతని మాట వినిలేదు. దీంతో చేసేదేమీ లేక చివరకు బ్యాంక్ మేనేజరే తన జేబులో ఉన్న డబ్బుల్ని వారికిచ్చి పంపించారు. అయితే అతని బ్యాంకు ఖాతాలో లక్షరూపాయలున్నాయ్. కానీ బ్యాంక్ అకౌంట్ కు నామినీ ఎవరూ లేరు. అందుకే బ్యాంక్ మేనేజర్ డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది.