ఆన్‌లైన్ క్విజ్.. అందరికీ యూజ్

by vinod kumar |
ఆన్‌లైన్ క్విజ్.. అందరికీ యూజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ప్రజలంతా బోర్‌గా ఫీలవుతున్నారు. ఈ సమయాన్ని విజ్ఞానం పెంచుకోవడానికి, గిప్ట్‌లు గెలుచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది బీహార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా తమవైన ప్రత్యేకతలుంటాయి. వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు అవసరం. అందుకోసం బీహార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆన్‌లైన్‌ క్విజ్‌ కాంటెస్ట్‌ల్లో జవాబులు చెప్పిన వారికి గిఫ్టులు, సర్టిఫికెట్లు ఇస్తోంది. బీహార్ పర్యావరణం, జంతు సంపద‌పై ఈ క్విజ్ ఉంటుంది. వీటి మీద ప్రజలకు అవగాహన రావడానికి ఇది మంచి తరుణమని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. ‘ప్రజలను ఎంటర్‌‌టైన్‌ చేసేందుకు దీన్ని మొదలుపెట్టాం. ఆ తర్వాత దీన్ని కాంపిటీషన్‌గా మార్చాం” అని దీపక్‌ కుమార్‌‌ అన్నారు. ఈ క్విజ్‌లో పాల్గొనాలనుకునేవారు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌‌ అకౌంట్లు చూడాలని సూచించారు. ఇందులో మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నారు. లాక్‌డౌన్‌ కొనసాగిన్నని రోజులు దీన్ని కంటిన్యూ చేస్తామని పేర్కొన్నారు. మొదటి ఫేస్ లాక్‌డౌన్ వేళల్లో.. ‘వాట్ మదర్ నేచర్ టీచ్ అజ్’ పేరుతో స్పెషల్ క్యాంపెయిన్ సిరీస్ నిర్వహించామన్నారు. ఈ సిరీస్ లో దాదాపు 21 యూనిక్ ఇన్మరేషన్స్ ఇచ్చామని తెలిపారు. ప్రజలు తమ రాష్ట్రానికి సంబంధించిన పర్యావరణం, అడవులు, క్లైమేట్ ల గురించి ప్రజలు తెలుసుకోవాలని, అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నారు.

tags :coronavirus, lockdown, bihar, bihar forest department, online quiz

Advertisement

Next Story

Most Viewed