కరోనా టీకా తీసుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్

by Anukaran |   ( Updated:2021-04-15 02:53:24.0  )
కరోనా టీకా తీసుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. గురువారం పాట్నాలోని ఒక ఆసుపత్రిలో ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయ‌న‌తో పాటు మరో ఇద్ద‌రు మంత్రులు కూడా పాట్నా హాస్పిట‌ల్‌లో టీకాలు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్ చేయించుకోవాలని, అర్హులైన వారందరు తప్పకుండా టీకా తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితిపై సమీక్ష జరగుతుందని తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ నేతృత్వంలో ఏప్రిల్ 17వ తేదీ అఖిల ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు” బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story