- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే కాకున్నా.. ఆరుసార్లు సీఎం
దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అంటే నితీశ్ కుమార్. నితీశ్ అంటే బిహార్. ఆ స్థాయిలో ఆయన ఆ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఏకంగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అన్నీ అనుకూలిస్తే ఏడోసారి సీఎం పదవి చేపట్టే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బీహార్ రాష్ట్రం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన నితీశ్ కుమార్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం గమనార్హం. 1977లో జనతా పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి ప్రస్తుత ఎన్నికల వరకూ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. 2000 సంవత్సరంలో మొదటిసారి సీఎంగా ప్రమాణం చేశారు.
సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన అప్పటికే కేంద్ర మంత్రి కూడా. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ సీఎంగా ప్రమాణం చేశారు. కానీ, ఏడు రోజులకే ప్రభుత్వం కూలిపోయింది. 2005 ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఘనవిజయం సాధించడంతో మళ్లీ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఆ రాష్ట్రంలో రెండు సభలు(విధానసభ, విధాన పరిషత్) ఉండటంతో 2006లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బిహార్ సీఎంగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ మూడు సార్లు విధాన పరిషత్‌కే ఎన్నికయ్యారు. కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై మాత్రం ఆసక్తి కరనబర్చలేదు.