ఎన్నికల షెడ్యూల్ విడుదల

by Anukaran |   ( Updated:2020-09-25 02:31:10.0  )
ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా విడుదల చేశారు. మునుపటిలా కాకుండా కోవిడ్ నిబంధలు అనుసరిస్తూ, ఎన్నికల నిర్వహణ జరుగనుంది కావున, పోలింగ్ సమయాన్ని గంట పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అవకాశం కల్పించారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం ఆన్‌లౌన్ ద్వారా జరుగనుందని తెలిపారు. అంతేగాకుండా నామినేషన్‌లు వేయడానికి గుంపులుగా కాకుండా ఇద్దరు మాత్రమే రావాలని సూచనలు జారీ చేసింది. ఇక పోలింగ్ స్టేషన్ వద్ద శానిటైజర్‌లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

మూడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాలు, రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలు, మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రచారం మొదలు.. ఓటింగ్ వరకు.. ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి. మాస్క్ ఉన్న వారిని మాత్రమే ఓటింగ్‌కు అనుమతిస్తారు. చివరి గంటలో కోవిడ్ రోగులకు ఓటువేసే అవకాశం కల్పిస్తారు

Advertisement

Next Story

Most Viewed