సహజీవనం చేసాకే పెళ్లి.. హౌస్‌లో అతడికి స్నానం చేయించా చూపించలేదు: బిగ్‌బాస్ బ్యూటీ

by Hamsa |   ( Updated:2023-10-01 04:45:39.0  )
సహజీవనం చేసాకే పెళ్లి.. హౌస్‌లో అతడికి స్నానం చేయించా చూపించలేదు: బిగ్‌బాస్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ దామిని ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బిగ్‌బాస్-7 రియాలీటీ షోకు వెళ్లి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఊహించని విధంగా మూడో వారం ఎలిమినేట్ అయింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దామిని షాకింగ్ విషయాలు తెలిపింది. ‘‘ నేను వెజిటేరియన్ కాకపోతే గుడ్డు తింటాను. మా ఇంట్లో చికెన్ తీసుకురారు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో నేను చికెన్ కర్రీ చేశాను. కానీ ఆ ఎపిసోడ్ చూపించలేదు. అలాగే ఓ టాస్క్‌లో భాగంగా నేను ప్రిన్స్ యావర్‌కు పేడ కొట్టాను. తర్వాత సారీ చెప్పి స్వయంగా నేను స్నానం చేపించాను. కానీ ఈ ఎపిసోడ్‌ను కూడా చూపించలేదు. వినాయక ఫెస్టివల్ జరిగినప్పుడు అతడిని మెచ్చుకున్నాను. అయితే గొడవ పడిన విషయాలు మాత్రమే చూపించారు. ఆ కారణంగా నా మీద వ్యతిరేకత వచ్చిందని తెలిపింది.

అనంతరం తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసినా పాట పాడాను. కానీ నా శరీరంలో ఇప్పటివరకు ఒక్క పచ్చబొట్టు కూడా వేసుకోలేదు. అలాగే నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం కుటుంబ సభ్యుల అనుమతితో కొన్ని రోజులు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందనేది నా ఒపీనియన్. ప్రస్తుతం సహజీవనం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అమ్మ నాన్న నన్ను చాలా అర్థం చేసుకుంటారు. అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇది తెలిసిన నెటిజన్లు లేడీ కంటెస్టెంట్‌ మగవాడికి స్నానం చేపించడం ఏంటని? ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story