Bigg Boss 7 Telugu : రతిక చుట్టే పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌస్‍లో ఏం జరుగుతోంది?

by Prasanna |   ( Updated:2023-09-09 05:05:38.0  )
Bigg Boss 7 Telugu : రతిక చుట్టే పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌస్‍లో ఏం జరుగుతోంది?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ ఇంట్లో ఎఫైర్స్ అనేది చాలా కామన్. వీటిని చూసి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రతీ సీజన్లో ఎవరో ఒకరు మరొకరిపై ఇంట్రస్ట్ చూపించడం కనిపిస్తూ ఉంటుంది. దీంతో జనాలు కూడా వారి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని అనుకుంటారు. అయితే ఈ సారి హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజు నుంచే మొదలు పెట్టారు. రతిక, పల్లవి ప్రశాంత్ కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. వారితో పాటు గౌతమ్, సుభా శ్రీ కూడా అలానే ఉన్నారు.రతికతో ఎవరైనా మాట్లాడినా.. క్లోజ్‍గా మూవ్ అయినా పల్లవి ప్రశాంత్ తట్టుకోలేకపోతున్నాడు. ఈ విషయంలో మిగతా కంటెస్టెంట్లు కూడా ప్రశాంత్‍ను ఏడిపించేందుకు ట్రై చేస్తున్నారు. రతిక ఎక్కడ ఉంటే.. అక్కడే ఉంటున్నాడు ఈ రైతు బిడ్డ.

ఈ విషయం గురించి రతిక ఒంటరిగా ఉన్నప్పుడు సుభా శ్రీ అడిగేసింది .నీకు ప్రశాంత్ మీద ఇంట్రస్ట్ ఉందా అని అడిగింది. దానికి ఈ ముద్దుగుమ్మ జవాబు చెబుతూ.. తనంటే ఇష్టమని బయటకు చెప్పేసింది. ఇష్టం అంటే ఎలా అంటూ ఇంకోసారి సుభా శ్రీ ప్రశ్నించింది. ఒక ఫ్రెండు అంతే.. కానీ అతడికి నీ మీద ఇంట్రస్ట్ ఉన్నట్టు ఉందని, తను నీతో ప్రవర్తించే తీరు అలాగే ఉంది..సుభా శ్రీ చెబుతుంది. అతను దేనికోసం చేస్తున్నాడో నాకు తెలియదని టాపిక్ క్లోజ్ చేసింది రతిక. హౌస్‍లోని కంటెస్టెంట్లు కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. కొందరు అప్పుడే మొదలు పెట్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొందరు రైతు బిడ్డను బాగా వాడుతున్నారంటూ అంటున్నారు.

Advertisement

Next Story