ఇకపై నేను ఏంటో చూస్తారు.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేముందే రతిక వీడియో

by sudharani |   ( Updated:2023-11-01 09:01:54.0  )
ఇకపై నేను ఏంటో చూస్తారు.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేముందే రతిక వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: రతిక రోజ్ గురించి తెలిసిందే. చిన్న చిన్న షోలతో, యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్‌లో మూడు వారాలు ఉండి.. నాలుగో వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. అయితే.. ఎలిమినేట్ అయిన ముగ్గురు (రతిక రోజ్, శుభశ్రీ, దామిని) కంటెస్టెంట్స్‌లకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే మరో అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా సందర్భంగా రతిక రోజ్ మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. హౌస్ లోకి వెళ్లే ముందే రతిక చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ మేరకు ‘హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, షాకింగ్‌గా ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఏమి మనసులో పెట్టుకోవద్దు. మీరు చూసే ఉంటారు. ఈపాటికే చాలా క్లారిఫికేషన్ ఇచ్చాను. మీరు కూడా రీలైజ్ అయుంటారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి రతిక ఎలా ఉండబోతుందో చూద్దాం అని అనుకుని.. ఇప్పటి నుంచి నా గేమ్ ఎలా ఉంటుంది. రతిక ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్‌గా పాయింట్ రేజ్ చేస్తుంది, అని మీరు ఫీల్ అయ్యి.. రతికకు కచ్చితంగా ఓట్స్ వేసి హౌస్‌లో ఉండేలా చేయాలి అని అనుకునేలా చేస్తాను. మీరు కూడా నాకు చివరి వరకు ఓట్ వేసి హౌస్‌లో ఉండేలా చేస్తారని నమ్ముతున్నాను. నాకు సపోర్ట్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed