నేనే కావాలని బయటకి వచ్చేసాను.. బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్ : shekhar basha

by Prasanna |   ( Updated:2024-09-16 05:52:52.0  )
నేనే కావాలని బయటకి వచ్చేసాను.. బిగ్ బాస్ హిస్టరీ లోనే  ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్ :  shekhar basha
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. మొదటివారం బేబక్క ఎలిమినేట్ అయింది. ఇక రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం పెద్ద షాకింగ్ లా ఉంది. బిగ్ బాస్ ఇంట్లో కొంచం కామెడీ చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే.. అది శేఖర్ బాషానే..! అలాంటిది అతన్ని సడెన్ గా ఎలిమినేట్ చేసేసరికి అందరూ బిగ్ బాస్ షో పై మండిపడుతున్నారు. అయితే, ఇక్కడే ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

శనివారం ఎపిసోడ్ లో నాగార్జున, శేఖర్ బాషాకు గుడ్ న్యూస్ చెప్పాడు.. మూడు రోజుల క్రితమే శేఖర్ బాషాకి కొడుకు పుట్టాడన్న విషయం తెలియడంతో అతను బయటకి వెళ్లిపోవాలని అనుకున్నాడట. దీంతో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యేట్టు బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేసిందని చెబుతున్నారు.

ఈ వార్తలపై స్పందించిన శేఖర్ బాషా.. " నన్ను ఎవరు బయటకు పంపలేదు.. నేనే వచ్చేసాను.. ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్. నా కొడుకును చూడటానికే బయటకు వచ్చా.. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కొంచెం ఫుడ్ కూడా ప్రాబ్లమ్ కూడా ఉండటం వలన వచ్చేసాను.. నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థాంక్స్.. నేను టాప్ 5 లో ఉంటానని నమ్మి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నాను" అంటూ ఆయన మాటల్లో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed