అబ్బాయితో మాత్రమే చేస్తా.. అమ్మాయితో నా వల్ల కాదు.. షకీలా కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-09-09 14:01:40.0  )
అబ్బాయితో మాత్రమే చేస్తా.. అమ్మాయితో నా వల్ల కాదు.. షకీలా కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: 6 సీజన్లు పూర్తి చేసుకుని తాజాగా 7వ సీజన్‌లోకి అడుగు పెట్టింది ‘బిగ్ బాస్’. గత సీజన్లతో పోల్చితే ఈ సారి ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునేట్టుగా ప్రిపేర్ చేశారు బిగ్ బాస్ టీం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంట్లో నామినేషన్ల ప్రక్రియ షురూ కాగా.. గొడవలు స్టార్ట్ అయ్యాయి. నువ్వా నేనా అన్నట్లుగా కొట్టుకుంటున్నారు హౌస్ మేట్స్. ఇక ఈ వారం ఇమ్యూనిటీ పవర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

ఈ మేరకు ‘‘శారీరకంగా మానసికంగా తమను తాము ప్రేక్షకులకు నిరూపించుకుంటూ చివరకు విజేతగా నిలిచిన ఒకరికి ఏకంగా 5 వారాల ఇమ్యూనిటీ పవర్ పొందే అవకాశం లభిస్తోంది’’ అని ప్రకటించి అందులో మొదటి టాస్క్ చెప్తాడు బిగ్ బాస్. ఇచ్చిన మొదటి టాస్క్ ఫేస్ ద బీస్ట్. ఇందులో బాగా బాడీలు పెంచిన అమ్మాయిని, అబ్బాయిని లోపలికి పంపిస్తాడు. వారితో కుస్తీ ఆడి గేమ్‌లో గెలవాలి. అయితే షకీలా మాత్రం నేను అబ్బాయితో కుస్తీ పోటీ పడతా కానీ.. అమ్మాయితో నాకు ఇష్టం ఉండదు అంటూ తెలిపింది. దీంతో షకీలా కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed