- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ హౌస్‌లో ‘బేబీ’ సినిమా స్టోరీ నడుపుతున్న రతిక!
దిశ, సినిమా: రీసెంట్‌గా వచ్చిన ‘బేబీ’ మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ముఖ్యంగా నేటి యువతకు బాగా కనెక్ట్ అయింది. ఇకపోతే తాజాగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతివారం మంచి ఊపుతో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే రీసెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అందరూ పవర్ కోసం పోటీ పడ్డారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా తనను టార్గెట్ చేసినట్లు అనిపిస్తుందని శివాజీ దగ్గర తన బాధను చెప్పుకొని ఏడ్చింది రతిక. ఇంతలోనే పల్లవి ప్రశాంత్ అక్కడికి వచ్చి.. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. నవ్వించడానికి ఎంతగానో ట్రై చేశాడు. అంతలోనే అక్కడికి వచ్చిన ప్రిన్స్.. రతిక మన మధ్యలో ఎవరెవరో ఎందుకు అన్నాడు. దీంతో రతిక నవ్వుతూ ఏడుపు ఆపేసింది. అయితే ఈ సంఘటన ఆధారంగా బిగ్ బాస్ హౌస్‌లో రతిక ‘బేబీ’ సినిమా స్టోరీ నడిపిస్తుందంటూ మీమ్స్, కామెంట్స్‌తో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.