శివాజీని అనవసరంగా హైలెట్ చెయ్యకండి.. అమర్ కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-12-18 16:01:20.0  )
శివాజీని అనవసరంగా హైలెట్ చెయ్యకండి.. అమర్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఘనంగా పూర్తి అయింది. కామెన్ మెన్‌గా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ సందడి పూర్తి కాగానే.. టాప్ 6లో ఉన్న అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ, అమర్, ఫైనల్‌గా పల్లవి ప్రశాంత్ ఇలా వరుసగా బిగ్ బాస్ బస్‌లో ఇంటర్య్యూలు కూడా ఇచ్చేశారు. అయితే.. అమర్‌ను ఇంటర్వ్యూ చేసే క్రమంలోనే గీతూ.. మీరు 105 డేస్ హౌస్‌లో ఉంటారని ఊహించారని అని అడిగింది.

దీనికి అమర్.. మొదటి నాలుగు వారాలు నేను ఆడిన ఆటకు అప్పుడే బయటకు వచ్చేస్తా అనుకున్న. కానీ తర్వాత బాగా ఆడాను అంటూ చెప్పాడు. ఇలా హౌస్‌లో ఒక్కొక్కరి గురించి గీతూ అడుగుతూ.. ‘శివాజీ నేను వెళ్తే ప్రశాంత్‌ని విన్నర్‌ని చేసే పోతా అంటూ మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటి’ అని అడిగింది. దానికి అమర్.. ‘అలా చెప్పి ఆయన్ని పైకి లేపకండి. ఆయన (శివాజీ) గేమ్ ఆయన ఆడుకుని వెళ్లిపోయారు. వీడు (ప్రశాంత్) గేమ్ వీడు ఆడుకున్నాడు కప్పు కొట్టాడు అంతే’ అంటూ చెప్పాడు. అమర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Read More..

ప్రభాస్ ‘సలార్’ జెన్యూన్ రివ్యూ.. (వీడియో)

Advertisement

Next Story

Most Viewed