బిగ్ బాస్- 7లోకి కాల్ గర్ల్ ఎంట్రీ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?

by Anjali |
బిగ్ బాస్- 7లోకి కాల్ గర్ల్ ఎంట్రీ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్‌లాగే పలు భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 స్టార్ అయ్యి ఇప్పటికీ 4 వారాలు గడిచాయి. ఆల్రెడీ ఎలిమినేషన్స్ కూడా మొదలయ్యాయి. 4 వారాల్లో వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్లు(కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక) ఎలిమినేట్ అయ్యారు. ఇక కన్నడ బిగ్‌బాస్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్‌బాస్ సీజన్-7 నిన్న (ఆదివారం) ఘనంగా ప్రారంభమయ్యింది. అయితే, హౌస్‌లోకి ఒక సర్ప్రైజింగ్ లేడీ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు.. ‘విక్రమ్’ చిత్రంలో కాల్ గర్ల్‌గా నటించి.. సౌండ్‌తో ఊపేసిన ‘మయా కృష్ణన్’.

వేదికపైకి రాగానే కమల్ హాసన్‌ను హగ్ చేసుకుని ఎంతగానో సంబరపడిపోయింది. ‘నాకు అవకాశాలు లేని సమయంలో విక్రమ్ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.’ అంటూ ఈ బ్యూటీ వేదికపై చెప్పుకొచ్చింది. అయితే మాయా కృష్ణన్‌ బిగ్‌బాస్‌లో ఎంపిక కావడానికి కొంచెం కమల్ హాసన్ హస్తం కూడా ఉందని తెలుస్తోంది. కాగా ఈమె రెమ్యూనరేషన్ రూ. 2.5 లక్షల వరకు ఫిక్స్ చేశారని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed