Bigg Boss 7 Telugu: బెల్టు పట్టుకుని.. శివాజీకి చుక్కలు చూపించిన నాగ్ .. పవరాస్త్రను వెనక్కి తీసుకున్న బిగ్ బాస్?

by Prasanna |   ( Updated:2023-10-01 04:46:38.0  )
Bigg Boss 7 Telugu: బెల్టు పట్టుకుని.. శివాజీకి చుక్కలు చూపించిన నాగ్ .. పవరాస్త్రను వెనక్కి తీసుకున్న బిగ్ బాస్?
X

దిశ,వెబ్ డెస్క్: మాస్టారూ.. మాస్టారు పాటతో షోలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఎప్పటిలాగానే శుక్రవారం హౌస్‌లో జరిగిన విశేషాలేంటో అందరికి చూపించారు. ఈ వారం రావడంతోనే నాగ్ కొంచం సీరియస్ గా ఉన్నట్టు అనిపించింది.

ఇక ఆ తరువాత శాస్త్రిబామ్‌ టాస్క్ కంటెస్టెంట్స్ తో ఆడిస్తారు. స్ట్రెస్ రిలీఫ్‌ ఎవరో.. తలనొప్పి ఎవరో ఒక్కొక్కరు వచ్చి చెబుతుంటారు. అయితే ఈ టాస్క్ లో ఎక్కువ మంది రతిక పెద్ద తలనొప్పి అంటూ చెబుతారు. శివాజీని, శోభను ఇద్దరి ఇద్దరి చొప్పున స్ట్రెస్ రిలీఫ్‌ అని చెప్తారు.

కట్ చేస్తే.. మన కింగ్ నాగ్ రంగంలోకి దిగి బెల్ట‌ పట్టుకుని.. హౌస్ మేట్స్‌ వైపు సీరియస్ గా చూస్తారు. శివాజీ, సందీప్‌ ఇద్దరూ సంచాలకులుగా ఫెయిల్ అంటూ..తేల్చి చెప్పేసారు. మీకు హ్యూమానిటీ లేదంటూ.. వాళ్ళిద్దరి పైన సీరియస్ అయ్యారు. గౌతమ్ విషయంలో తేజ చేసిందే తప్పు అని అతన్ని కూడా తిట్టేసారు. తేజాతో పాటు.. సందీప్‌, శివాజీ లను ఏం చేస్తే బాగుటుందో మిగతా కంటెస్టెంట్స్‌ను అడిగారు. అప్పుడు సందీప్‌.. తేజ తప్పుగా బిహేవ్ చేసాడు.. అతడిని ఇంటికి పంపాలని చెప్పగా.. ‘అలా అయితే ముందు నిన్ను కూడా బయటికి పంపాలని నాగ్ కామెంట్ చేసారు. ఇద్దరూ అన్‌ డిజర్వింగ్ కంటెస్టింట్‌గా శివాజీ , సందీప్‌.. హౌస్‌ మేట్స్‌ చేత ఎన్నికయకయ్యారని చెబుతారు. వీరిలోసందీప్‌ను హౌస్‌లోని ముగ్గురే అన్‌ డిస్వరింగ్ అంటూ.. శివాజీకి మాత్రం ఏకంగా ఆరుగురు అన్‌డిస్వరింగ్ అంటూ ఓటేస్తారు. దీంతో పవరాస్త్రను వెనక్కి తీసుకుంటున్నామని నాగ్ తేల్చి చెప్పేసారు.

Advertisement

Next Story