- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss-7: వాళ్లకు నువ్వంటే పగ కాదు భయం.. అది లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి నోరు జారిన శోభ
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇంకా రెండు వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉండటంతో.. హౌస్‌లో రసవత్తమైన పోరు నడుస్తోంది. ప్రస్తుతం హౌస్ ఓట్ అపిల్ టాక్స్ నడుస్తుండగా ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే అమర్, ప్రశాంత్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అయితే.. ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. ప్రోమో స్టార్టింగ్‌లో ప్రియాంక, శోభ శెట్టిలు దర్శనమివ్వగా.. తర్వాత నిన్న జరిగిన దానికి నాకు బీపీ లేచింది అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఇక అమర్ ఎప్పటిలాగే.. తనకు వచ్చిన కోపాన్ని ఎదుటి వాడిపై నెట్టే ప్రయత్నం చేశాడు. ఎదుటి వాడిని ఎలా మాట్లాడి రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టారు అంటూ ప్రశాంత్ గురించి మాట్లాడాడు.
అయితే.. ప్రశాంత్ మాత్రం వాళ్లకు నేను అంటే ఫస్ట్ నుంచి ఎందుకు అంత పగ అంటూ శివాజీ దగ్గర ఎమోషనల్ అయ్యాడు. దానికి స్పందించిన శివాజీ.. వాళ్లకు నువ్వంటే పగ కాదురా భయం అంటూ చెప్పుకొచ్చాడు. నిన్న జరిగిన గొడవతో శోభ శెట్టి శివాజీ గురించి నోరు జారింది. ఈ మేరకు అమర్, ప్రియాంకలతో మాట్లాడుతూ.. చెయ్యడానికి సామర్థ్యం లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి అంటూ మాట్లాడింది. ఈ వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అమర్, ప్రియాంక, శోభ శెట్టిలు కలిసిప్రశాంత్, యావర్‌పై పగబట్టినట్లు కావాలనే గొడవ పడుతున్నారు. దీంతో శనివారం నాగార్జున ఎపిసోడ్ కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచుస్తున్నారు. వాళ్లపై ఫైర్ అవుతారా లేక ఎప్పటిలాగా చిన్న క్లాస్ పీకి ఊరుకుంటారా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.