Rathika Elimination: .. క్లాస్ పీకిన నాగ్.. తేజకు తప్పని ముప్పు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రోమో

by sudharani |   ( Updated:2023-09-30 14:24:34.0  )
Rathika Elimination: .. క్లాస్ పీకిన నాగ్.. తేజకు తప్పని ముప్పు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రోమో
X

దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 నాలుగో వారం కూడా వచ్చేసింది. హౌస్ మేట్ అయ్యేందుకు కంటెస్టెంట్లు తెగ ఆరాటపడుతున్నారు. ఎలాంటి పోటీకైనా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఫోర్త్ హౌజ్‌మేట్‌గా నిలిచేందుకు.. బిగ్ బాస్ ఫన్నీగా రెడీ అవ్వమని టాస్క్ ఇచ్చారు. ఇక టాస్క్‌లు అన్ని ముగియగా మొత్తానికి ప్రశాంత్ పవర్ అస్త్ర గెలుచుకుని, నాలుగో ఇంటి సభ్యుడు అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా శనివారానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ సారి కూడా నాగార్జున ఇంటి సభ్యులని గట్టిగా వేసుకున్నాడు.

సెల్ఫీ టాస్క్‌లో ఇచ్చిన కొరడాతో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఒక్కొక్కరికి క్లాస్ ఇచ్చాడు. ముందుగా తేజ ఈ టాస్క్‌లో గౌతమ్‌తో చేసిన బిహేవియర్ గురించి మాట్లాడాడు. తర్వాత సంచాలకుడిగా ఓడిపోయారంటూ సందీప్, శివాజీలపై ఫైర్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రతికనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె పల్లవి ప్రశాంత్‌తో పెట్టుకున్న గొడవలు, కాంట్రవర్సీల కారణంగా ఓటింగ్ పోల్స్‌లో డేంజర్‌లో ఉందని సమాచారం. అందుకే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రతిక అని తెలుస్తోంది.

Advertisement

Next Story