బిగ్‌బాస్-7: ఉల్టా పుల్టా సీజన్.. మళ్లీ వైల్డ్ కార్డుతో రీ ఎంట్రీ ఇస్తా.. సందీప్ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |
బిగ్‌బాస్-7: ఉల్టా పుల్టా సీజన్.. మళ్లీ వైల్డ్ కార్డుతో రీ ఎంట్రీ ఇస్తా.. సందీప్ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ‘బిగ్‌బాస్-7’ ఈ సారి చాలా రసవత్తరంగా సాగుతోంది. ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంటే అందరికీ ఆసక్తి రెట్టింపు అవుతోంది. అయితే ఆట సందీప్ 8వ వారం మొదటిసారి నామినేట్ అయి.. అదే వారం ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘‘నేను 7 వారాలు నామినేషన్‌లో లేకపోవడమే నా ఎలిమినేషన్ కారణం. ఇంటిలోకి వెళ్లిన తర్వాత బిగ్‌బాస్ నాకు 5 వారాలపాటు ఇమ్యునిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ హిస్టరీలోనే అది రికార్డు. 6వ వారం నుంచి నేను నిజాయితీగా ఆడాను. ఇంట్లో అందరితో కలిసి మెలిసి ఉన్నాను. సిట్యుయేషన్ బట్టి ఇంటి సభ్యుల మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి.

అమర్, అర్జున్ నా వాళ్ళు అనుకున్నాను. కానీ వారిద్దరూ నాకు ద్రోహం చేశారు. నాతో ఉంటూ నా వెనుక దొంగాట ఆడారు. నేను వారిని నమ్మడం వల్ల ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ ఇద్దరి వల్లనే నేను వెన్నుపోటుకు గురయ్యాను నమ్మకుండా ఉండాల్సింది. బిగ్‌బాస్ తెలుగు-7 ఉల్టా పుల్టా సీజన్. ఎవరు ఎప్పుడు ఉంటారో.. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియదు. నేను మళ్లీ ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. త్వరలోనే నేను వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రీ ఎంట్రీ ఇస్తాను కావొచ్చు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ కామెంట్స్ వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story