బిగ్‌బాస్-7: తొమ్మిదో వారం నామినేషన్స్‌లో ఎంత మంది కంటెస్టెంట్స్ ఉన్నారంటే? (వీడియో)

by Hamsa |   ( Updated:2023-11-11 17:23:06.0  )
బిగ్‌బాస్-7:  తొమ్మిదో వారం నామినేషన్స్‌లో ఎంత మంది కంటెస్టెంట్స్ ఉన్నారంటే? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్-7 ఎనిమిది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది. బిగ్‌బాస్ అన్ని సీజన్లతో పోలిస్తే ఈ సారి మాత్రం నిజంగా ఉల్టా పుల్టా అని చెప్పవచ్చు. వరుసగా ఏడుగురు అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు వచ్చారు. మొదటివారం కిరణ్ రాథోడ్ షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక రోజ్‌, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో నయని పావని, ఏడవ వారంలో పూజ మూర్తి ఎలిమినేట్ అవ్వగా ఎనిమిదో వారం సందీప్ మాస్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా, ఈ వారంకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక తొమ్మిదో వారం నామినేషన్స్ రచ్చ మామూలుగా లేదు. నామినేషన్ చేయాలనుకునే ఇద్దరు ఇంటి సభ్యులను డ్రాగన్ స్నేక్ ముందు నిలబెట్టాలని బిగ్‌బాస్ సూచించాడు. నామినేషన్ అనంతరం డ్రాగన్ స్నేక్ నోట్లోంచి వచ్చే రంగు వారిపై పడుతుందన్నాడు. ఇక ఈ నామినేషన్స్‌లో అంబటి అర్జున్, ప్రిన్స్ యావర్, భోలే షావలి, అమర్ దీప్ చౌదరి, టేస్టీ తేజ, శోభా శెట్టి, రతిక రోజ్, ప్రియాంక జైన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story