Bigg Boss-7: కంటెస్టెంట్‌కి ఛాతినొప్పి.. హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చిన నిర్వాహకులు!

by Hamsa |   ( Updated:2023-10-11 05:09:50.0  )
Bigg Boss-7: కంటెస్టెంట్‌కి ఛాతినొప్పి.. హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చిన నిర్వాహకులు!
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ రియాలిటీ షో అన్ని బాషల్లో సక్సెస్ ఫుల్‌గా పలు సీజన్లను పూర్తి చేసుకున్నాయి. తమిళ బిగ్ బాస్‌కి మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఏడో సీజన్‌ని కూడా కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 7 న గ్రాండ్‌గా ఈ షో లాంచ్ అయ్యింది. తాజాగా, అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ షోకి కంటెస్టెంట్‌గా వచ్చిన ప్రముఖ రచయిత బావ చెల్లదురై అనుకోకుండా ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు టాక్. ఆయనకు తీవ్ర అనారోగ్య సమస్యతో షో నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. తనకు ఛాతి నొప్పి వస్తుందని.. హౌస్‌లో ఉండలేనని తనను ఇంటికి పంపమని ఆయన వేడుకోవడంతో నిర్వాహకులు బయటకు తీసుకువచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫిజికల్ టాస్క్‌లలో యాక్టివ్‌గా ఉండకపోవడంతో తోటి కంటెస్టెంట్లు ఆయనను ఈ వారం నామినేట్ చేశారు. దీంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే బావ చెల్లదురై కుటుంబ సభ్యులు స్పందించాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed