Bigg Boss-7: నరాల సమస్యతో కిందపడిపోయిన అమర్ దీప్.. అసలు ఏం జరిగిందంటే?

by Hamsa |   ( Updated:2023-09-29 06:02:00.0  )
Bigg Boss-7: నరాల సమస్యతో కిందపడిపోయిన అమర్ దీప్.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 స్టార్ట్ అయి ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కావొస్తుంది. అయితే ప్రతి వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ టాస్క్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ను మొత్తం ప్రసారం కాకుండా మేకర్స్ అడ్డుకున్నారని ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 28వ తేది ఎపిసోడ్‍లో ఏటీఎమ్ బజర్ టాస్కులో కాయిన్స్ సౌండ్ వచ్చినప్పుడు ప్రిన్స్ యావర్ బజార్ మోగించాడు. దీంతో అతని పార్టనర్, ప్రత్యర్థులను ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రశాంత్‍ను తన పార్టనర్‌గా, ప్రత్యర్థులుగా గౌతమ్, అమర్‍లను అనుకున్నాడు ప్రిన్స్. వీరికి ఒక చిన్న గ్లాస్ నిండా కన్నీళ్లు నింపే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో అమర్, గౌతమ్ ఉల్లిపాయలు, నిమ్మకాయలు కంట్లో పిండుకుని నీళ్లు తెప్పించుకునేందుకు ప్రయత్నించారు.

అనంతరం సహజంగానే కన్నీళ్లు రావాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక తప్పక లోపలి నుంచి బాధను తెప్పించుకుని కన్నీళ్లు రావడానికి అమర్, గౌతమ్ తెగ ట్రై చేశారు. ప్రశాంత్ నేలమీద దొర్లుతూ మరి కన్నీళ్లు తెచ్చుకున్నాడు. ప్రశాంత్‍ను చూసి శోభా తెగ ఏడ్చేసింది. రతిక కూడా అదో రకంగా ఓ లుక్ ఇచ్చింది. అయితే ఇదంతా లైవ్‍లో వచ్చిందట. కానీ, ఎపిసోడ్‍లో మాత్రం మొత్తం ఎత్తేశారట. కేవలం కన్నీళ్ల టాస్క్ లో ప్రశాంత్, యావర్ ఇద్దరు గెలిచారు అని ప్రకటించారు. అయితే అందుకు కారణం ఈ టాస్కులో సీరియల్ హీరో అమర్ దీప్‍కు నరాలు స్టక్ అయిపోయి కింద పడిపోయాడట. అంతేకాకుండా ఏడుపు టాస్క్ లో వాళ్లు కన్నీళ్ల కోసం చేసే ప్రయత్నాలు జనాలు చూస్తే భరించలేరని, ఎపిసోడ్ తర్వాత షోపై కేసులు కూడా పెట్టే అవకాశం ఉందని ముందుగానే పలువురు రివ్యూవర్లు రివ్యూ ఇచ్చారని తెలుస్తోంది. ఈ భయంతోనే మేకర్స్ ఈ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనివ్వలేదని సోషల్ మీడియాలో టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియదు ఈ విషయం తెలిసిన వారు మాత్రం రకరకాలుగా అనుకుంటున్నారు.

Advertisement

Next Story