- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BigBoss : బిగ్ బాస్‌కు భారీ జరిమానా..
దిశ, సినిమా : మలయాళం బిగ్ బాస్ సీజన్ 3 మేకర్స్ ఇబ్బందుల్లో పడ్డారు. ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా.. షూటింగ్‌లు నిలిపివేయాలన్న తమిళనాడు ప్రభుత్వ కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా షో ఫిల్మింగ్ జరుగుతుండటంతో రూ. లక్ష రూపాయల జరిమానా విధించారు. ఇప్పటికే 95 రోజుల బిగ్ బాస్ జర్నీ పూర్తి కాగా ఏడుగురు కంటెస్టెంట్‌లు మాత్రమే మిగిలి ఉన్నారని తెలిపిన హోస్ట్ మోహన్ లాల్.. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద కేసు నమోదైందని తెలిపారు.
దీంతో బిగ్ బాస్ పరిసరాలను సీజ్ చేయాల్సి వచ్చిందన్నారు. సినిమా, స్మాల్ స్క్రీన్ షూటింగ్‌లు జరగకూడదని FEFSI యూనియన్ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారని, ఇది నిరంతర ఎపిసోడ్ కావడంతో ప్రొడక్షన్ హౌస్ షూటింగ్ కొనసాగించిందని తెలిపారు. కంటెస్టెంట్స్, కెమెరామెన్స్, టెక్నీషియన్స్ హౌజ్ లోపలే ఉంటారని, వారికి భోజనం అందించబడుతుందని తెలిపిన మోహన్ లాల్.. ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయగానే షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుందన్నారు.