బిగ్ బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో బిగ్ బాస్ బ్యూటీ.. విషమంగా ఆరోగ్యం

by Anukaran |   ( Updated:2021-07-24 23:51:48.0  )
బిగ్ బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో బిగ్ బాస్ బ్యూటీ.. విషమంగా ఆరోగ్యం
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, బిగ్ బాస్ ఫేమ్ యాషికా ఆనంద్‌తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌తో పాము మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed