- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బాస్-5 సీజన్ డేట్ ఫిక్స్?
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్‌బాస్.. ఈ పేరే ఓ సంచనలం. లింగ భేదం లేకుండా 20 మందిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ ఇంటిలో ఉంచి గేమ్స్ ఆడిపించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్‌లో దూసుకుపోయింది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. తెలుగులోనూ బిగ్‌బాస్ హవా కొనసాగింది. ఈ మధ్యనే బిగ్‌బాస్4 సీజన్ పూర్తి అయింది. అందులో పాల్గొన్న ఆర్టిస్టులకు ఈసారి సినిమాల నుంచి మంచి ఆఫర్లే కొట్టేశారు.
బిగ్‌బాస్ 4 పూర్తయి నెల రోజులు గడవక ముందే స్టార్ మా బిగ్‌బాస్ 5 సీజన్‌కు అప్పుడే కసరత్తు ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై వాళ్లు అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ కు మించి భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
బిగ్‌బాస్-5 సీజన్‌కు కూడా హోస్ట్‌గా నాగార్జుననే వ్యవహరించనున్నారు. బిగ్‌బాస్ 3, 4 సీజన్స్ లో నాగార్జున తనదైన శైలిలో అటు హౌస్ మెంట్స్‌ని, ఇటు వీక్షకులను ఆకట్టున్నారు. ఈ కారణంలో బిగ్‌బాస్ నిర్వాహకులు సీజన్ 5కి కూడా ఆయననే హోస్ట్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈసారి పాల్గొనే హోస్ట్‌కు, కంటెస్టెంట్‌కు భారీ మొత్తంలో నజరానా ఇవ్వడానికి బిగ్‌బాస్ రెడీ అయినట్లు తెలిసింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రేండింగ్‌లో ఉన్న ఆరుగురిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహకులు సెలక్ట్ చేశారనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. 5వ సీజన్ కోసం దూకుడు ప్రదర్శిస్తున్న నిర్వహకులు అన్నీ కుదిరితే ఆగస్టు నెల చివరి ఆదివారం (29న) షోను ప్రారంభిచేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై బిగ్ బాస్ టీం త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయబోతోందని సమాచారం. ఏదిఏమైనా సీజన్ 4 టీఆర్పీ రేటింట్స్ ప్రభంజనం సృష్టించడంతో మంచి జోష్ మీదున్న బిగ్ బాస్ టీం.. సీజన్ 5ని ఇంత త్వరగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయడం పట్ల స్టార్ మా ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.