- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ‘సోహెల్’
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్‌బాస్-4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్‌లో బిగ్‌బాస్-4 తెలుగు ఫేం సోహెల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయిన వారికి పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయన్నారు . ప్రస్తుతం ప్రజలు మంచి నీటిని డబ్బు లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, నీరు మాదిరిగా రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకూడదని, ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు.
తన అభిమానులు ఇలా మొక్కలు నాటి ఎం.పి సంతోష్ కుమార్‌తో పాటు తనకు ఇన్స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాను మరో ముగ్గురు ( అరియానా , మెహబూబ్ , అఖిల్ )లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.