బిగ్ బాస్ లో అరాచకం: అర్ధరాత్రి బాత్రూమ్ లో లహరి రొమాన్స్.. ప్రియా ఆంటీ డర్టీ టాక్

by Anukaran |   ( Updated:2021-09-21 05:59:54.0  )
బిగ్ బాస్ లో అరాచకం: అర్ధరాత్రి బాత్రూమ్ లో లహరి రొమాన్స్.. ప్రియా ఆంటీ డర్టీ టాక్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు బయటికి వెళ్లగా.. 17 మంది మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతోంది. ఇక ఈ మూడో వారంలో ఒకరిపై ఒకరు ఎలిమినేట్ చేసుకొంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో నటి ప్రియ నోరు జారింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా లహరి.. ప్రియను నామినేట్‌ చేసింది. ‘మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని తెలుపుతూ ఆమె పేరును బద్దలుకొట్టింది. దీనికి ప్రియ బదులిస్తూ.. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలతో బిజీగా ఉన్నావు, కాబట్టి! అని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

అంతేకాకుండా కేవలం నువ్వు మగాళ్లతోనే కలిసి ఉంటున్నావు.. ఇక మాతో మాట్లాడే టైమ్ ఎక్కడుంది అని చెప్పింది. దీనికి పేర్లు చెప్పండి అన‌గా.. ర‌వి, మాన‌స్‌ల పేర్లు చెప్పేసింది. నీకు మ‌గాళ్ల‌తో ప్రాబ్ల‌మ్స్ ఉండ‌దు. అందుకే వారిని ఎప్పుడు నామినేట్ చేయ‌వు అంటూ దారుణ‌మైన కామెంట్స్ చేసింది ప్రియ. ఇంకా లహరి గురించి చెప్తూ.. లహరి, రవి అర్ధరాత్రి బాత్రూమ్ లో హాగ్ చేసుకోవడం చూశానని చెప్పుకొచ్చింది.

ఛీఛీ.. ఇంత దిగజారాలా.. లిప్ లాక్ కోసం హీరోయిన్ కాళ్లు ఒత్తిన స్టార్ హీరో

ఇక ఈ మాటలతో బీబీ హౌస్ రణరంగంగా మారింది. ఒక అమ్మాయిపై ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలరు అంటూ మిగతా కంటెస్టెంట్లు ఫైర్ అయ్యారు. హాగ్ చేసుకోవడం తప్పా..? అసలు అక్కడ ఏం జరిగిందో చూడకుండా, తెలుసుకోకుండా మీరెలా స్టేట్ మెంట్ ఇస్తారు అంటూ ప్రియపై దుమ్మెత్తిపోశారు. ఈ విషయమై ప్రియ సారీ చెప్పినా ఒక్కరు కూడా ఆమెను క్షమించలేదు. ఇక వీటిపై స్పందించిన రవి.. లహరి తనకు సోదరి లాంటిదని, తన బర్త్ డే కాబట్టి విష్ చేయడానికే హాగ్ చేసుకొందని క్లారిటీ ఇచ్చాడు.

అటు లహరి కూడా మరోసారి తనలోని అర్జున్‌రెడ్డి యాంగిల్‌ను బయటపెడుతూ.. నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని హెచ్చరించింది. ఇకపోతే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ప్రియ ఒక్కసారిగా వైలెంట్ యాంగిల్ బయటపెట్టడంతో అభిమానులు షాక్ అయ్యారు. ప్రియా ఆంటీ ట్రూ కలర్స్ బయటపెట్టిందిరోయ్ అంటూ మీమ్స్ తో హల్చల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రియ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది. మరి ఈ ఘటనతో ప్రియా ఈ వీక్ బయటకి వచ్చే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది.

స్టార్ హీరో ఫామ్ హౌస్ లో దారుణం.. పదేళ్ల చిన్నారిని అనుభవించి..

Advertisement

Next Story

Most Viewed