భారీ ఆఫర్లు… అక్టోబర్ 1 నుంచి బిగ్‌బజార్‌లో..

by Harish |
Offer in Big Bazar
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ హైపర్ మార్కెట్ బ్రాండ్ బిగ్‌బజార్ వినియోగదారులకు ప్రత్యేక ‘బిగ్ షాపింగ్ ఫెస్టివల్’ మెగా ఈవెంట్ ప్రారంభించింది. బిగ్‌బజార్ యాప్, ఈ-కామర్స్ సైట్ ద్వారా అక్టోబర్ 1-10 తేదీల మధ్య వినియోగదారుల పండుగ ఆఫర్లను పొందవచ్చని తెలిపింది. పండుగ సీజన్ కోసం కిరాణా, వంట సామాగ్రీ, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, లగేజీ సామానుపై గొప్ప ఆఫర్లను, తగ్గింపులను ఇవ్వనున్నట్టు బిగ్‌బజార్ ప్రకటించింది. ఈ ఏడాది బిగ్ షాపింగ్ ఫెస్టివల్ కోసం వినియోగదారులకు ఇదివరకు లేనన్ని ఎక్కువ ఆఫర్లను అందిస్తున్నామని, నిత్యావసరాలను ఆఫర్ కింద అందించనున్నట్టు పేర్కొంది.

రూ. 3,000 నుంచి రూ. 10 వేల విలువైన షాపింగ్ చేసిన వారికి ఎంపిక చేసిన నిత్యావసరాలను ఇవ్వనున్నారు. అంతేకాకుండా, రూ. 44, 990 విలువైన టీవీని కేవలం రూ. 16,999కి మాత్రమే పొందవచ్చని బిగ్‌బజార్ తెలిపింది. బ్రాండెడ్ లగేజీ వస్తువులపై 70 శాతం తగ్గింపును ప్రకటించింది. ‘ దేశవ్యాప్తంగా పండుగ సీజన్ సమయంలో వినియోగదారులకు అవసరమైన వస్తువులను తక్కువ ధరకే అందించాలని భావించాం. బిగ్‌బజార్‌లో షాపింగ్ ద్వారా తమ వినియోగదారులు మెరుగైన అనుభవాన్ని పొందగలరని’ ఫ్యూచర్ గ్రూప్ మార్కెటింగ్ సీఎంఓ పవన్ చెప్పారు.

Advertisement

Next Story