- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత ఇలాకాలో బాజిరెడ్డి గోవర్దన్‌కు ఊహించని షాక్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి, పలు ప్రాంతాలు జలమయం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరికొండ మండలంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌కు ఊహించని షాక్ తగిలింది. తుంపల్లి గ్రామ శివారులోని కప్పల వాగు పరిశీలనకు వెళ్లిన ఆయన్ని.. సర్పంచ్ తండా వాసులు అడ్డుకున్నారు. సర్పంచ్ తండా-గోపాల్ తండా మధ్యలోని మొండివాగు ఉప్పొంగడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయానని మహిళలు ఆందోళన చేపట్టారు.
మూడేండ్ల క్రితమే రూ. 5.5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయినా.. పనులు ఎందుకు ప్రారంభించడం లేదని బాజిరెడ్డిని నిలదీశారు. తమ ఇబ్బందులను ప్రత్యక్ష్యంగా చూసేందుకు కారు దిగి పరిశీలనకు రావాలని పట్టుబట్టారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సొంత నియోజకవర్గంలోని తండాకు చేసిందేమీ లేదని విమర్శించారు. తండా వాసులు ఎంత పట్టుబట్టినా.. ఎమ్మెల్యే కారు దిగకపోవడంతో పాటు ఎటువంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో తండా వాసులు కారుకు అడ్డుతొలగకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని సముదాయించారు. బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత సొంత ఇలాకాలోనే పరాభవం ఎదురైంది. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.