జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు బిగ్ షాకిచ్చిన యువకుడు

by Sumithra |
జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు బిగ్ షాకిచ్చిన యువకుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డుపై వాహనం నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి పోలీసులు చలాన్లు జారీ చేస్తుంటారు. అదే సమయంలో మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు. అయితే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా.. ఓ యువకుడు మద్యం తాగి కారు నడుపుతున్నట్టు గుర్తించారు.

దీంతో యువకుడి వివరాల గురించి పోలీసులు ఆరా తీయగా.. తాను ఆదిలాబాద్ జిల్లాకి చెందిన వరప్రసాద్ అని వయస్సు 22 అని చెప్పారు. అనంతరం కేసు నమోదు చేసి నవంబర్ 10న సమన్లు ఇచ్చేందుకు యువకుడి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వరప్రసాద్(17) మైనర్ అని తెలియడంతో సదరు యువకుడు తమను మోసం చేశాడని జూబ్లీహిల్స్‌ శాంతి భద్రతల విభాగానికి స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed