ఫ్లాష్.. ఫ్లాష్.. రేవంత్ కు భారీ షాక్.. కేటీఆర్ ఏంచేశారంటే..?

by Anukaran |   ( Updated:2021-09-20 00:49:39.0  )
Revanth KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై చర్చ జరుగుతోంది. అయితే మంత్రి కేటీఆర్ సినీ ప్రముఖులతో స్నేహం ఉందని, ఆయన కూడా డ్రగ్స్ తీసుకుంటారని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, దీనిని మంత్రి కేటీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాగా, రేవంత్ రెడ్డి మరిన్నీ ఆరోపణలు చేస్తుండటంతో మంత్రి సీరియస్ అయ్యారు. దీనిపై ఆయన మరో ట్వీట్ చేశారు.

ఆయన చేసిన ట్వీట్ ” Today I have invoked the legal process & filed a suit for defamation and injunction before the Hon’ble court, I am confident that the Court process will clinchingly vindicate the falsity of the canards& lies spread against me and the culprits will be brought to book appropriately” అని చేశారు. అంటే “తనపై అనవసరంగా ఆరోపణలు, అబద్దాలు చెబుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈ అబద్దపు ఆరోపణలను నిషేధించేందుకు కోర్టులో పరువు నష్టం దావా వేశాను. న్యాయస్థానం తనపై వస్తున్న ఆరోపణలను అబద్ధాలని నిరూపిస్తుందన్న నమ్మకం ఉంది.” అని అన్నారు. దీనిపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed