జియోలో గూగుల్ పెట్టుబడులపై చర్చలు!

by Harish |
జియోలో గూగుల్ పెట్టుబడులపై చర్చలు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు సోమవారం గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన తర్వాత మంగళవారం మరో సంచలన విషయం వార్తల్లో నిలిచింది. ఇండియా డిజిటలైజేషన్‌‌లో భాగంగా రూ. 75 వేల కోట్ల నిధులను కేటాయించిన గూగుల్ సంస్థ రిలయన్స్ జియోలోనూ పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధమవుతోందని అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. రిలయన్స్ అనుబంధంగా ఉన్న డిజిటల్ వేదికల్లో దాదాపు రూ. 30వేల కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు రిలయన్స్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, ఈ కథనంపై గూగుల్ స్పందించేందుకు నిరాకరించింది. రిలయన్స్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుత సంవత్సరం ప్రారంభమైన తర్వాత, కరోనా కాలంలో రిలయన్స్ జియో అత్యధిక పెట్టుబడులను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ సుమారు 25 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 1.18 లక్షల కోట్ల నిధులను జియో సేకరించగలిగింది. భారత్‌లో వేగంగా పుంజుకుంటున్న డిజిటలీకరణ నేపథ్యంలో జియో ఈ విభాగంలో దూసుకెళ్తుందనే నమ్మకంతో పెట్టుబడిదారులు జియోలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed