- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం
దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతోంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. 822 పోస్టల్ బ్యాలెట్లకు గాను 758 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 503 ఓట్లతో ఆధిక్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొనసాగుతున్నారు. బీజేపీకి 159, కాంగ్రెస్‌కు 32, చెల్లని ఓట్లు 14 నమోదు అయ్యాయి. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 90 శాతం పోస్టల్ బ్యాలెట్లను సాధించింది. కానీ, హుజురాబాద్ బై పోల్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు కూడా అనుకూలత కనబర్చారు. మరి కాసేపట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదటగా హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగ్గా, ఒక్కో రౌండ్‌లో 9 వేల నుంచి 10 వేల ఓట్ల లెక్కిస్తారు.