చైనా విషయంలో భారత్‌కే మద్దతు

by Anukaran |   ( Updated:2020-11-08 04:49:43.0  )
చైనా విషయంలో భారత్‌కే మద్దతు
X

దిశ, వెబ్ డెస్క్: ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనా దుందుడుకుతనం పెరిగింది. పొరుగు దేశాల పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు తీవ్రం చేసింది. అమెరికాతోనూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా ట్రేడ్ వార్ కు దిగింది. చైనా దుస్సాహసాలు అమెరికా ప్రభుత్వం కంట కనిపెడుతూనే ఉన్నది. చైనాతో పొంచి ఉన్న ముప్పు పై రిపబ్లికన్, డెమోక్రటిక్ లకు మధ్య భిన్న దృక్పధాలు ఉన్నాయి.

ఏదేమైనప్పటికీ లడాఖ్ లో ఏర్పడ్డ ఉద్రిక్తతలపై ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగా పలుసార్లు భారత్ కే మద్దతు ప్రకటించింది. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇదే హామీ భారత్ కోరుకోవడం సహజం. బైడెన్ బృందం కూడా చైనా విషయంలో భారత్ కే అండగా ఉంటుందని ఆయన క్యాంపెయిన్ డాక్యుమెంట్ తెలిపింది. ఇండో పసిఫిక్ రీజియన్లో స్థిరత్వానికి చర్యలు తీసుకుంటుందని, చైనా సహా ఏ దేశ దుస్సాహసాన్నీ ఉపేక్షించబోమని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed