- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాకు రాంరాం: హీరో సైకిల్స్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద సైకిల్స్ తయారీ కంపెనీ హీరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా భారత్, చైనా మధ్య వివాదం నేపథ్యంలో చైనా ఉత్పత్తులను నిషేధించాలనే ప్రచారం కొనసాగుతున్న క్రమంలో హీరో సైకిల్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల చైనాతో రూ.900 కోట్ల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు హీరో సైకిల్స్ ఛైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ వెల్లడించారు.
చైనా వస్తువులను బహిష్కరించడంలో తమ సంస్థ నిబద్ధతను నిరూపిస్తూ రానున్న మూడు నెలల కాలంలో చైనాతో రూ. 900 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు పంకజ్ ప్రకటించారు. భవిష్యత్తులో కొత్త మార్కెట్ల కోసం అన్వేషిస్తామని ఆయన స్పష్టం చేశారు. చైనా తీరుపై అంతర్జాతీయంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో థాయ్‌లాండ్, వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, తాము కూడా తమ సైకిల్ పరిశ్రమల వ్యాపార విస్తరణ కోసం ఆయా దేశాల్లో అవకాశాల కోసం చూస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, యూరప్ మార్కెట్లలో పుంజుకోవడానికి జర్మనీలో కర్మాగారాన్ని ప్రారంభించే అవకాశం ఉందన్నారు. కాగా, హీరో ఎలక్ట్రిక్ సైకిల్స్ విభాగమైన ఈ-సైకిల్ ప్రాజెక్టులో 72 శాతం వాటా భారత్‌వేనని ఆయన స్పష్టం చేశారు.