- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియా ముందుకు నారా భువనేశ్వరి.. ఆ వ్యాఖ్యలపై రియాక్షన్ ఇదే..!
దిశ, ఏపీ బ్యూరో : తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని.. ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడాలని ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎవరి భావజాలాలు వారికి ఉంటాయని కానీ విపత్కర సమయంలో అందరూ సహాయం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో భువనేశ్వరి పర్యటించారు. తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో మృతి చెందిన 48 మంది వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని భువనేశ్వరి అందజేశారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ప్రజలంతా సేవాదృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అసూయ, ద్వేషాలను పక్కన పెట్టి ప్రేమను పంచాలని సూచించారు. ఆపద సమయంలో బాధితులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి సహాయం అందించినట్లు చెప్పుకొచ్చారు. సమాజానికి న్యాయం చేయాలి.. నిరుపేదలను ఆదుకునేందుకు ఎన్టీఆర్ తన జీవితాన్ని త్యాగం చేశారని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా తన మూలాలు మరవని వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని తమ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. దేశం గొప్ప విజయాలు సాధించడానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు భువనేశ్వరి శాపం.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
మరోవైపు ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నారా భువనేశ్వరి స్పందించారు. నోటికొచ్చినట్టు ఆడవాళ్లపై మాట్లాడొద్దని హితవు పలికారు. మహిళలను గౌరవించాలని సూచించారు. సమాజంలో ఏ మహిళనూ అవమానపరచకూడదని.. అది సమాజానికి మంచిది కాదని భువనేశ్వరి పిలుపునిచ్చారు. నాపై చేసిన వ్యాఖ్యలపై బాధపడ్డా. నా భర్త చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. నాపై వ్యాఖ్యలు చేసినవారు వాళ్లపాపాన వాళ్లేపోతారు. వాళ్ల క్షమాపణ నాకు అక్కర్లేదు. ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోను. బాధలో ఉన్న నాకు కుటుంబం అండగా నిలిచింది. ఈ హెరిటేజ్‍ను ఎవరూ టచ్ చేయలేరని భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.