"నేను వాటికి డీప్‌గా కనెక్టయ్యా.. కానీ, నన్నెవరూ అప్రోచ్ కావడంలేదు" :Bhumi Pednekar

by Shyam |   ( Updated:2021-09-29 06:05:01.0  )
నేను వాటికి డీప్‌గా కనెక్టయ్యా.. కానీ, నన్నెవరూ అప్రోచ్ కావడంలేదు :Bhumi Pednekar
X

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరోయిన్ భూమీ పెడ్నేకర్ ‘దమ్ లగా కే హైషా’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ, సోంచిరియా, శుభ్ మంగళ్ సావ్‌ధాన్, శాండ్ కీ ఆంఖ్’ లాంటి ప్రతీ సినిమాలోనూ జెండర్ ఈక్వాలిటీపై స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. కాగా, ఓ ఇంటర్వ్యూలో తన మూవీ సెలెక్షన్‌పై మాట్లాడిన భూమి.. తన సినిమాల ఎంపికపై పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. ప్రతీ మూవీ యూనిక్ అండ్ స్పెషల్‌గా ఉండాలని కోరుకుంటానన్న ఆమె.. ముఖ్యంగా మెసేజ్ ఓరియంటెడ్, ఉమెన్‌ను సరిగ్గా పొట్రేట్ చేసే కంటెంట్‌కు ఇంపార్టెన్స్ ఇస్తానని వివరించింది. ఒక మహిళగా.. మహిళలను గౌరవించే స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం డ్యూటీగా భావిస్తానని తెలుపుతూ తన దగ్గరకు వచ్చిన అమేజింగ్ స్క్రిప్ట్‌ల వల్లే అలాంటి అద్భుత పాత్రలు పోషించే అవకాశం లభించిందని చెప్పింది. సొసైటీని ప్రభావితం చేసే ఒక నిష్ట మార్గంలో మహిళలను చిత్రీకరించడం గొప్పవిషయమన్న ఆమె.. అలాంటి దర్శకులు తనను అప్రోచ్ కావడం అదృష్టమని, ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్‌తో డీప్‌గా కనెక్ట్ అయ్యానని, అందుకే ప్రజలు ఇష్టపడ్డారని అభిప్రాయపడింది భూమి.

Advertisement

Next Story