- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమా ఫ్యామిలీలో సంబరాలు.. భూమా నాగిరెడ్డి మళ్లీ ఇలా పుట్టాడంటూ..
దిశ, ఏపీ బ్యూరో: భూమా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త భార్గవ రామ్ స్వయంగా ప్రకటించారు. శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ కుమారుడికి జన్మనివ్వడం విశేషం. అఖిలప్రియకు పండంటి మగబిడ్డ పుట్టిన విషయం తెలయడంతో భూమా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మళ్లీ ఇలా పుట్టారంటూ అభిమానులు సందడి చేశారు. ఇకపోతే భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పుడే భార్గవ రామ్‌ని పెళ్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమా అఖిలప్రియ దంపతులు భూ వివాదాల్లో ఇరుక్కున్నారు. అంతేకాదు హైదరాబాద్‌లోని భూ వివాదంలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన కేసులో అఖిల అరెస్ట్ సైతం అయ్యారు. వీటితోపాటు అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ భూమా అఖిలప్రియ మాత్రం టీడీపీలో దూకుడుగానే ఉంటున్న సంగతి తెలిసిందే.