- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: సుబ్బారాయుడు హత్య కేసులో తమ కుటుంబానికి సంబంధం ఉందని దమ్ముంటే వారంలోగా నిరూపించాలని ఎమ్మెల్యే శిల్పా రవికి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సవాల్ విసిరారు. అలా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఆమె అన్నారు. తమపై తప్పుడు కేసులు పెడితే విడిచి పెట్టబోమని ఆమె అన్నారు. నంద్యాల డివిజన్‌లో ఏం జరిగినా తమ కుటుంబం పైనే బురదజల్లుతున్నారని ఆమె తెలిపారు. శిల్పా రవి పుట్టక ముందు నుంచే తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని ఆమె చెప్పారు. కేసులు మీద కేసులు పెట్టి తన తండ్రిని హింసించారని ఆమె తెలిపారు.
Next Story