- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీదేవి కూతురు సినిమా… భూమా అఖిల రియాక్షన్
దిశ, వెబ్ డెస్క్: ఆ సినిమా నా మనసుని హత్తుకుంది. మూవీ చూస్తున్నంతసేపూ నాకు నాన్నే గుర్తొచ్చారు. నాన్న బ్రతికి ఉండుంటే ఆయనతో కలిసి ఈ సినిమా చూసేదాన్ని. స్త్రీ శక్తిని చాటి చెప్పిన సినిమా ఇది. తండ్రీ కుమార్తె మధ్య ఉండే అనుబంధాన్ని ఈ సినిమా పదే పదే గుర్తు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి”. ఇవన్నీ మాజీ మంత్రి, కర్నూలు జిల్లా టీడీపీ కీలక మహిళా నేత భూమా అఖిలప్రియ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
అసలు విషయం ఏమిటంటే… జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా మూవీని నెట్ ఫ్లిక్స్ (netflix) లో చూశారు భూమా అఖిల. శరణ్ శర్మ దర్శకత్వం వహించగా… కరణ్ జోహార్, హీరూ జోహార్, అపూర్వ మెహతా సినిమాను నిర్మించారు. ఫ్లైట్ లెప్టినెంట్ గుంజన్ సక్సేనా (gunjan saxena) బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కింది.
కార్గిల్ గర్ల్ గా గుర్తింపు పొందిన గుంజన్ వైమానిక దళంలో పనిచేవారు. కార్గిల్ యుద్ధ సమయంలో తన సేవలను అందించారు. చీతా హెలికాప్టర్లను నడపించారు. ఆమె చేసిన సేవలకు, ప్రదర్శించిన ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గుంజన్ సక్సేనాను శౌర్యచక్రతో గౌరవించింది. ఈ పతకాన్ని అందుకున్న తొలి మహిళ కూడా ఆమే.
ఇక ఈ సినిమా చూసిన అఖిలప్రియ తాను ఈ మూవీని చూశానని, చూస్తున్నంతసేపూ భావోద్వేగానికి లోనయ్యానని తెలిపారు. మహిళా శక్తిని ఈ సినిమా ప్రపంచానికి చాటి చెప్పిందని… వైమానిక దళంలో చేరాలనుకునే ఓ యువతి తన కలను ఎలా సాకారం చేసుకున్నారనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారని కొనియాడారు.
పట్టుదల, దానికి తగ్గ కృషి ఉంటే ఏమైనా సాధించవచ్చు అని గుంజన్ సక్సేనా నిరూపించారని అన్నారు. తండ్రీకుమార్తె మధ్య ఉండే ఆప్యాయతను అందంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సినిమా చూస్తున్నంతసేపూ నాన్న గుర్తుకొచ్చారన్నారు. ఐ మిస్ మై డ్యాడ్ అని ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ చేసారు భూమా అఖిలప్రియ.