'భీమ్లా నాయక్' బ్రేక్ టైమ్.. నిజమైన నాయకుడు ఏం చేస్తున్నాడంటే..?

by Shyam |   ( Updated:2023-10-10 15:54:09.0  )
భీమ్లా నాయక్ బ్రేక్ టైమ్.. నిజమైన నాయకుడు ఏం చేస్తున్నాడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుపాటి మల్టీస్టారర్ గా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గింప్స్ రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ గా పవన్, డానియేల్ శేఖర్ గా రానా కనిపించనున్నారు. ఈ చిత్రంపై మేకర్స్ కొత్త కొత్త అప్ డేట్స్ ఇస్తూ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ‘బ్రేక్ టైమ్ ఇన్ భీమ్లా నాయక్’ అనే పేరుతో పవన్ కు సంబంధించిన ఓ స్మాల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు, ఈ వీడియో లో పవన్ గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

పవన్ స్టైల్ గా కారు మీద కాలు పెట్టి ఫైరింగ్ చేస్తూ కనిపించడంతో పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ కు గన్స్ కి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ వీడియో పక్కన పవన్ పాత్ర స్వభావాన్ని ప్రకృతితో పోలుస్తూ చెప్పుకొచ్చారు. ” యోగి కమండలం కొమ్ములో నుంచి చెట్లకు ప్రాణధారలు వదులుతాడు.. యోధుడు తుపాకీ గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు.. నాయకుడూ.. ఈ రెండింటిని భుజానమోసుకుంటూ.. ముందుకు కదుల్తాడు..” అంటూ నిజమైన నాయకుడికి ఉండే లక్షణాలను తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Advertisement

Next Story