అప్పులు ప్రమాదకరంగా మారుతున్నాయి

by Shyam |
అప్పులు ప్రమాదకరంగా మారుతున్నాయి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో అప్పులు ప్రమాదకరంగా మారుతున్నాయని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేల కోట్ల అప్పు తెచ్చుకునే విధంగా ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చారని, కార్పొరేషన్ అప్పులు సైతం 200 శాతానికి పెంచుకున్నారని, అప్పులు, పన్నుల భారం ప్రజల మీదే పడుతుందని భట్టీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని, కరోనా నియంత్రణపై ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, పేదలకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేతృత్వంలో జిల్లా ఆస్పత్రుల్లో పర్యటన చేస్తామని, బుధవారం భద్రాచలం నుంచి పర్యటన ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భట్టి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed