కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది: భట్టి

by Shyam |
కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది: భట్టి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ కరోనాపై కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, జర్నలిస్టులకు కరోనాకు సోకుతుందని, కొద్దిమంది చనిపోయారని, అసలు మంత్రులు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదన్నారు. ప్రజా సమస్యలపై మంత్రులకు ఫోన్ చేస్తే స్పందన ఉండదని, ప్రగతి‌భవన్‌, ఫామ్‌హౌస్‌లో బాగానే ఉన్నరన్నారు. రాష్ట్ర ప్రజలకు కరోనా ప్యాకేజీ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లయ్యిందని, సీఎం, మంత్రులు ఎక్కడ ఉంటారో తెలియదన్నారు. ల్యాండ్‌లైన్‌ పనిచేయదని, మొబైల్ ఫోన్లు మంత్రులు ఎత్తరని విమర్శించారు. మూడు నెలల విద్యుత్ బిల్లులు ఒకేసారి వసూలు చేసి పేదలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 11న సీఎల్పీ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ చేపడుతామని భట్టి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed