ఆ పద్దతి ద్వారా రూ. 21,000 కోట్లను సేకరించనున్న ఎయిర్‌టెల్!

by Harish |
airtel
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధులను సమీకరించేందుకు సంస్థ బోర్డు ఆదివారం ఆమోదం తెలిపింది. తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో పరిశ్రమ ధోరణి, వ్యాపార వాతావరణం, ఆర్థిక, వ్యాపార వ్యూహాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ క్రమంలో మరింత మూలధనాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికలకు ఆమోదం తెలిపినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్రస్తుతం ఉన్న వాటాదారులకు రైట్స్ ఇష్యూ ద్వారా ఈక్విటీ షేర్లను కేటాయించి ఈ నిధులను సేకరించనున్నట్టు’ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌టెల్ పేర్కొంది.

ఒక్కో షేర్ ముఖ విలువ రూ. 5 చొప్పున ఈక్విటీ షేర్ విలువ రూ. 535 ప్రాతిపదికన రైట్స్ ఇష్యూ జారీ చేయనున్నట్టు కంపెనీ వివరించింది. ఈ తాజా ఆమోదం ప్రకారం.. ఎయిర్‌టెల్ వాటాదారులు తమ వాటాలకు 25 శాతం అదనంగా నిధులను చెల్లించాల్సి ఉంటుందని, 14 ఈక్విటీ షేర్లు ఉన్నా, అర్హత ఉన్నా, వాటాదారునికి ఒక ఈక్విటీ షేర్‌ను కంపెనీ కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఏ వాటాదారుడైనా రైట్స్ ఇష్యూను తిరస్కరించవచ్చని, ప్రత్యామ్నాయంగా సబ్‌స్క్రైబర్ కొనుగోలు చేయడానికి వీలుటుందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed