- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భారతీయ కాంగ్రెస్ పార్టీ’ ఫ్లెక్సీ వైరల్
దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఏమిటో చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ.. గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ కట్ అవుట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఓ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్‌గా మారింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ పోస్టర్‌లో బీజేపీ జెండా ఉంచడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే ఆ పోస్టర్ చూసిన ప్రజలు ఖంగుతింటున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఎప్పుడు కలిసి పోయాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ‘‘భారతీయ కాంగ్రెస్ పార్టీ’’ అయ్యాయ అని ఛలోక్తులు విసురుతున్నారు. అయితే ఈ ఫ్లెక్సీ డిజైనర్ తప్పు చేశాడా.. లేక కావాలనే ఎవరైన క్రియోట్ చేశారా అన్నది తెలియాల్సి ఉన్నది.
True Face of Both These National Parties in #Telangana 🤷♂️#BharatiyaCongressParty👇👏@KTRTRS pic.twitter.com/4uySX80ian
— Govardhan Reddy D (@DGRTRS) September 16, 2021